కొంతమంది  సెలబ్రిటీలు సైతం ప్రేమలో పడి తమ లైఫ్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. మరి కొంతమంది వివాహం చేసుకొని సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి తమ భర్త బిజినెస్ వైపు అడుగుజాడలలో నడుస్తూ సక్సెస్ గా ముందుకు వెళుతూ ఉండగా మరి కొంతమంది భర్త స్టార్ స్టేటస్ లో భాగమవుతూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం బ్రేకప్ చెప్పుకొని మళ్లీ తిరిగి కెరీర్ అని నిలబెట్టుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలా ప్రియుడుతో బ్రేకప్ తర్వాతే చాలామంది హీరోయిన్స్ స్టార్ స్టేటస్ ని అందుకున్నారు.


అలాంటి వారిలో హీరోయిన్ నయనతార టాప్ ప్లేస్ లో ఉందని చెప్పవచ్చు  శింబుతో ప్రేమాయణం మొదలుపెట్టి ఆ తర్వాత ఆ ప్రేమను ఎక్కువ రోజులు నిలుపుకోలేదు. ఆ వెంటనే మళ్ళీ ప్రభుదేవా తో ప్రేమలో పడి పెళ్లి దాకా వచ్చి మనస్పర్ధలు కారణంగా ఆ పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది. ఇక ప్రభుదేవాతో పెళ్లి క్యాన్సిల్ తర్వాతే కొన్ని నెలలు డిప్రెషన్ లో ఉన్న నయనతార.. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా అయ్యి సౌత్ లోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకొనే హీరోయిన్గా పేరు సంపాదించింది నాయనతర. ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ ను ప్రేమించి మళ్లీ వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.



ఇక మరొక హీరోయిన్ త్రిష బ్రేకప్ తర్వాత ఈమె కూడా టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది. తమిళనాడుకు చెందిన బిజినెస్ మ్యాన్ వరుణ్ తో ప్రేమలో పడి వివాహానికి సిద్ధమవుతున్న తరుణంలో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వివాహాన్ని క్యాన్సిల్ చేసుకుంది.ఆ తర్వాత 40 ఏళ్ల లో కూడా త్రిష వరుసబెట్టి సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. వీరే కాకుండా చాలామంది హీరోయిన్స్ కూడా లవ్ ఫెయిల్యూర్ వల్ల ధైర్యాన్ని తెచ్చుకొని మరి తమ సిని ఫీచర్ ని కొనసాగిస్తూ తమ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: