మలయాళ నటుడు మోహన్ లాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోహన్ లాల్ కొంత కాలం క్రితం L2 ఎంపురన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇకపోతే తాజాగా మోహన్ లాల్ "తుదరమ్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్లో విడుదల అయ్యి అద్భుతమైన టాక్ ను బాక్సా ఫీస్ దగ్గర తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన తొమ్మిది రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ తొమ్మిది రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

తొమ్మిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి కేరళ ఏరియాలో 58.55 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.35 కోట్ల కలెక్షన్లు దక్కాయి. కర్ణాటక ఏరియాలో 6.15 కోట్ల కలెక్షన్లు దక్కగా , తమిళ్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 6.10 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక ఓవర్సీస్ లో ఈ మూవీ కి 68.05 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 69.30 కోట్ల షేర్ ... 141.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు 23.20 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఇప్పటికే ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: