
ఈ సినిమా ఒక్క మంచి కామిడీ టైమింగ్ తో చక్కగా వినోదాన్ని పంచినప్పటికి.. బాక్సాఫీస్ వద్ద మూవీ బోల్తా కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమా చాలా అంచనాలతో రిలీజ్ అయినప్పటికీ.. హిట్ మాత్రం కొట్టలేకపోయింది. ఈ సినిమాలో నటులు వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటించారు. అలాగే ఈ సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా నటించారు. అయితే ఈ సినిమా త్వరలో టీవీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా టీవీలోని జీ5 ఛానల్ లో ప్రసారం కానుంది. అదే రోజు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన జీ5 వేదికగా కూడా స్ట్రీమింగ్ అవుతుందని టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రతివారం మంచి పాపులర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి.. హిట్ టాక్ ని అందుకుంటాయి. అటు తెలుగు, ఇటు హిందీతో పాటుగా కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అయితే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి.