ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రతివారం మంచి పాపులర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి.. హిట్ టాక్ ని అందుకుంటాయి. అటు తెలుగు, ఇటు హిందీతో పాటుగా కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అయితే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఈ వేసవి సెలవులలో ప్రేక్షకులను వినోదాన్ని పంచేందుకు సూపర్ మూవీస్ తో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు సిద్ధం అయ్యాయి. ఈ క్రమంలో రిలీజ్ అయిన కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. మరి ఆ మూవీస్ ఏంటో.. ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ది మ్యాచ్, లాస్ట్ బుల్లెట్, గుడ్ బాడ్ అగ్లీ, ది హంటెడ్ అపార్ట్మెంట్ మిస్సిక్,  బాడ్ ఇన్ ఫ్లూయన్స్, ది డిప్లొమాట్, ది రాయల్స్ సినిమాలు స్రీమింగ్ అవుతున్నాయి.

అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో గ్రామ్ చికిత్సలయం అనే హిందీ సినిమా ఆడుతుంది. ఈటీవీ విన్ లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే తెలుగు సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో హీరోగా ప్రదీప్ మాచిరాజు నటించారు. హీరోయిన్ గా దీపిక పిల్లి నటించింది. ఈ మూవీ యూత్ ని బాగా అలరించింది. ఈ సినిమా థియేటర్ వద్ద పర్వాలేదనిపించింది. జియో హాట్ స్టార్ ఓటీటీలో స్టార్ వార్స్ అనే యానిమేషన్ ఫిలిం స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే యువ క్రైమ్ ఫైల్స్, పోకర్ ఫేస్ మూవీస్ హాట్ స్టార్ లో ఆడుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్లి వీక్షించండి

మరింత సమాచారం తెలుసుకోండి: