ఆపరేషన్ సిందూర్.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే వార్తలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . జమ్మూకాశ్మీర్లో జరిగిన ఎటాక్ కౌంటర్గా భారత్ - పాకిస్తాన్ ఉగ్రస్ధావరాల పై దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే . భారత్ ప్రతీకారం తీర్చుకోవాలి అంటూ చాలామంది భారత్ కి సపోర్ట్ గా నిలుస్తూ పాకిస్తాన్ లోని ఉగ్రస్ధావరాలని పూర్తిగా ధ్వంసం చేయాలి అంటూ చాలామంది పిలుపునిచ్చారు. అయితే భారత సైన్యం పాకిస్థాన్ లోని ఉగ్రస్ధావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది . దానికి ప్రతీకారచర్య గా పాకిస్తాన్ తన మిస్సైల్స్  ను భారత్ పైకి వదులుతుంది . ఆ మిసైల్స్ ను సమర్థవంతంగా పాకిస్థాన్లోనే పేల్చేస్తుంది ఇండియన్ ఆర్మీ .


కాగా భారత ప్రజల సంరక్షణ కోసం భారత ఆర్మీ చేస్తున్న సేవలకు ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్ చేస్తున్నారు . ఆపరేషన్ సిందూర్ పై దేశ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా సినీ రాజకీయ క్రీడ ప్రముఖులంతా కూడా భారత సైనికుల ధైర్య సాహసాలకు అభినందిస్తూ ఆపరేషన్ సిందూర్ పై ఏదో ఒక పోస్ట్ పెట్టి భారత ఆర్మీని కొనియాడుతున్నారు . అయితే కొంతమంది స్టార్స్ మాత్రం ఆపరేషన్ సింధూర్ ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ అయితే అసలు స్పందించడం లేదు . అమీర్ ఖాన్ - సల్మాన్ ఖాన్ - షారుఖ్ ఖాన్ లాంటి స్టార్స్ అస్సలు ఆపరేషన్ సింధూర్ పై రియాక్ట్ కాకపోవడం చర్చనీయాంశం గా మారింది.



అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ కూడా సిందూర్ ఆపరేషన్ పై రియాక్ట్ కాకపోవడం ఫుల్ ఆయనకు నెగిటివిటీ క్రియేట్ చేసింది . గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రభాస్ ని టార్గెట్ చేశారు జనాలు . ఎట్టకేలకు ప్రభాస్ స్పందించి రియాక్ట్ అయ్యాడు . భారతదేశం ఉన్నతంగా నిలుస్తుంది అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టాడు . అయితే ప్రభాస్ పోస్ట్ ని కొంతమంది కాంట్రవర్షియల్ చేస్తున్నారు . అంత పెద్ద స్టార్ హీరో ఇంత చిన్న పోస్ట్ నేనా పెట్టేది అంటూ కావాలనే ప్రభాస్ పెట్టిన పోస్ట్ ని  నెగిటివ్గా చూస్తున్నారు .

100కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోకి ఆ మాత్రం ఇండియన్ ఆర్మీ ని పొగిడే అంత టైం కూడా లేదా ..? ఇలాంటి హీరో సినిమాల మనం థియేటర్స్ లో చూడడానికి కొట్టుకొని చచ్చేది అంటూ ఘాటు ఘాటుగా స్పందిస్తున్నారు . ఎవరో ప్రభాస్ అంటే పడిన వాళ్ళే ఇలా ప్రభాస్ పోస్టును నెగిటివ్ గా చిత్రీకరిస్తున్నారు అంటూ మండిపడుతున్నారు రెబెల్ ఫ్యాన్స్.  ప్రభాస్ ఎప్పుడు ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ గా ఉంటాడు అంటూ ఆయనని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: