పాన్ ఇండియా .. పాన్ ఇండియా.. పాన్ ఇండియా నిద్రలేచిన పాన్ ఇండియా.. నిద్ర పోయినా పాన్ ఇండియా..ఏ హీరో నోట విన్న పాన్ ఇండియా.. ఏ డైరెక్టర్ ని మాట్లాడించిన పాన్ ఇండియా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అందరూ ఎక్కువగా వాడే పదం పాన్ ఇండియా ..పాన్ ఇండియా.. పాన్ ఇండియా అంటూ సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు జపం చేస్తున్నారు . అయితే ఇక్కడ జనాలకి అర్థం కాని విషయం ఏంటంటే పాన్ ఇండియా సినిమాలు అయితేనే హిట్ అవుతాయా ..? కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు హిట్ అవ్వవా ..? అని ప్రశ్నిస్తున్నారు .


చిన బడ్జెట్ అయిన కంటెంట్ ఉంటే మాత్రం సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దానికి బిగ్ ఎగ్జాంపుల్ గేమ్ ఛేంజర్.. అలాగే కోర్టు మూవీ . "గేమ్ చేంజర్" సినిమాను తెరకెక్కించడానికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . పైగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో  అందాల ముద్దుగుమ్మ కీయరా అద్వానీ హీరోయిన్  .. వీళ్ల బ్యాక్ గ్రౌండ్ ఎంత ఎక్కువ అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు . డైరెక్టర్ శంకర్ అందరూ కూడా తోపైనా స్టార్సే. మరి ఈ సినిమా మాత్రం పెట్టిన దానికి ఒక్క రూపాయి కూడా లాభం తీసుకురాలేకపోయింది ఎందుకు ..? ఎందుకంటే అవాస్తవిక చిత్రణతో తీస్తే ఫ్లాపే అవుతుంది మూవీ అంటూ ప్రూవ్ చేశారు జనాలు .



కోర్టు మూవీ చాలా చిన్న నటీనటులతో తెరకెక్కింది . కానీ రియాలిటీ ని చూపించింది . వాస్తవ పరిస్థితులకు అద్దం పడితే కలెక్షన్లు వస్తాయి అని అవాస్తవిక చిత్రణతో తీస్తే ఏ సినిమా అయినా అట్టర్ ప్లాప్ అవుతుంది అని ప్రూవ్ చేసింది గేమ్ ఛేజర్ మూవీ . అలాగే కోర్టు మూవీ . అయితే ఇప్పుడు హిట్ ఆర్ ప్లాప్ అనేది ఏ హీరోకి అవసరం లేదు . తమకు పాన్ ఇండియా ఇమేజ్ వస్తే చాలు . తాము తీసుకునే 100 కోట్లు అకౌంట్లో పడితే చాలు.  తమ ఫ్యామిలీతో హ్యాపీగా వెకేషన్స్ వెళ్లి..కాల్ షీట్స్ టైం కి ఇచ్చి సినిమా షూట్ చేశామా కంప్లీట్ చేసామా అంతే ..



సినిమానే నమ్ముకొని నిర్మించిన నిర్మాతలు .. ఆ సినిమానే నమ్ముకుని హీరోల పైన ఆశలు పెట్టుకున్న డిస్ట్రబ్యూటర్లు ఎటు పోతే మాకేం అనే రేంజ్ లోనే పాన్ ఇండియా హీరోలు ఉన్నారు అని.. పాన్ ఇండియా హీరో అంటే స్టేటస్ కాదు ఒక గౌరవం అలాంటి గౌరవం ఉన్న సినిమాలను నటిస్తేనే బాగుంటుంది అంటున్నారు జనాలు . ఒకప్పుడు ఏఎన్ఆర్ - ఎన్టీఆర్ సినిమాకి అంత హై రెమ్యూనరేషన్  తీసుకోలేదు . కానీ వాళ్ళు చేసిన సినిమాలు హిట్ అవ్వలేదా..? కధా కంటెంట్ ఉండాలి అప్పుడే కథలో బలం లేకపోతే ఎంత పెద్ద పాన్ ఇండియా హీరో అయిన చివరికి జీరో గానే మిగులుతాడు. ఆఖరికి కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే దానికి కూడా పనికిరాడు .. ఇలాగే పాన్ ఇండియా పాన్ ఇండియా అని పట్టుకొని వేలాడకుండా జనాలకి ఉపయోగపడే సినిమాలు తీస్తే మంచిది అంటున్నారు సినిమాని ఇష్టంగా చూసే జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: