తమిళంలో స్టార్ డైరెక్టర్గా పేరుపొందిన లోకేష్ కనకరాజు డైరెక్షన్లో సినిమాలు చేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు.. మా నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో తదితర చిత్రాలను తెరకెక్కించే మంచి విజయాలను అందుకున్నారు. పాన్ ఇండియా వైడ్ గా మంచి క్రియేట్ సంపాదించుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజు ప్రస్తుతం హీరో రజినీకాంత్ తో కూలీ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో అక్కినేని హీరో నాగార్జునతో పాటు, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శృతిహాసన్, సత్యరాజు తదితర నటి నటులు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు.


తన డ్రీమ్ కాంబినేషన్ సెట్ చేసుకున్న డైరెక్టర్ ఎవరైనా సరే సినిమాని అద్భుతంగా తీయాలని అందుకోసం కొంతమేరకు సమయాన్ని కూడా తీసుకుంటు ఉంటారు. అయితే రాజమౌళి, సుకుమార్ మరి కొంతమంది డైరెక్టర్లు అయితే సినిమాను పక్కాగా తెరకెక్కించడానికి సుమారుగా రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుందని చెప్పవచ్చు.. కానీ స్టార్ కాస్టింగ్ పెట్టుకొని డైరెక్టర్ లోకేష్ కనకరాజు కేవలం 8 నెలల లోపే సినిమా తీయడమే కాకుండా ఎమోషన్స్లో కూడా పాల్గొంటున్నారు.


తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లోకేష్ పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం జరిగింది.. ముఖ్యంగా తానేమి rrr లాంటి సినిమాని తీయట్లేదు కదా తనకు మూడేళ్ల సమయం పట్టడానికి కూలి సినిమా కేవలం 6 నుంచి 8 నెలల లోపే పూర్తి చేశారని అలాగే తన సినిమాలు చేసే నటీనటుల్ని ఎవరిని కూడా మీ గెటప్స్ ని  మార్చాలని, వేరే సినిమాలు చేయవద్దని తాను ఎప్పుడూ చెప్పలేదని.. సాధారణంగా నేను అలాంటి రకం కాదు అని తెలిపారు. అయితే డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కొంతమంది రాజమౌళి ఫ్యాన్స్ లోకేష్ పైన ఫైర్ అవుతూ ఉన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: