
మే 16న తెలుగు, తమిళ భాషల్లో లెవన్ మూవీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీన్ చంద్ర సినిమాకు సంబంధించి ఎన్నో విశేషాలు పంచుకున్నారు. అలాగే తనకు ఉన్న ఓ స్పెషల్ టాలెంట్ ను కూడా నవీన్ చంద్ర బయట పెట్టారు. సాధారణంగా నటీనటులు ఇతర భాషల్లో సినిమాలు చేసేటప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్‌లపై ఎక్కువ ఆధారపడుతుంటారు. భాష రాకపోవడంతో యాక్టింగ్ మాత్రమే చేసి డబ్బింగ్ వెర్షన్ ను వేరే వారితో చెప్పించుకుంటారు. స్టార్ హీరో, హీరోయిన్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు.
ఎవరో కొందరు మాత్రమే అన్ని భాషల్లో మ్యానేజ్ చేయగలుగుతారు. అటువంటి టాలెంటెడ్ పర్సన్స్‌లో నవీన్ చంద్ర ఒకరు. తన తాజా చిత్రమైన `లెవన్` కు తెలుగుతో పాటు తమిళ వెర్షన్‌కు డబ్బింగ్ కూడా ఆయనే చెప్పుకున్నారట. అంతేకాదండోయ్.. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ ఇలా మొత్తం ఎనిమిది భాషల్లో నవీన్ చంద్ర అనర్గళంగా మాట్లాడగలడట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పడంతో.. నెటిజన్లు ఆశ్యపోతున్నారు. ఈ విషయంలో స్టార్ హీరోలనే నవీన్ చంద్ర షాక్ అయ్యేలా చేశాడని అభిప్రాయపడుతున్నారు. కాగా, రేపు విడుదల కాబోయే `లెవన్` మూవీ నవీన్ చంద్రకు ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు