
సుస్మిత కు ఇదే మొదటి సినిమా కాబట్టి ఈ సినిమా కోసం చిరంజీవి తీసుకొనే రెమ్యూనరేషన్ లో మొదట సగభాగం అంటే సుమారుగా 25 నుంచి 30 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే సుస్మిత ఒకటే కాకుండా సాహుగారపాటి కూడా చిరంజీవి చిత్రంలో భాగం కావడంతో ఇద్దరు కలిసి ఇంత రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెమ్యూనరేషన్ విషయంలో కుమార్తెకు కూడా ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదట చిరంజీవి.
అంతేకాకుండా తన తండ్రి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా చేసే సమయంలో కూడా కొంతమేరకు రెమ్యూనరేషన్ నిర్మాణ సంస్థల నుంచి కూడా అందుకున్నదట. ఇప్పుడు ఆ స్థాయి నుంచి రెమ్యూనరేషన్ చెల్లించే స్థాయికి ఎదిగింది సుస్మిత. అలాగే ఒకపక్క తన కాస్ట్యూమ్ డిజైనర్ వృత్తిని కూడా కొనసాగీస్తూ తన నిర్మిస్తున్న చిత్రాలకు కూడా తానే కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతున్నదట. అలా చేస్తేనే తన సినిమా బడ్జెట్ ఖర్చులు కూడా తగ్గుతాయని లెక్కలేసుకొని మరి సుస్మిత ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి సినిమా కావడం చేత సక్సెస్ అవుతుందని నమ్మకంతో సుస్మిత చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా కూడా టాలీవుడ్లో పేరు సంపాదించారు అనిల్ రావిపూడి.