
కానీ రెబల్ అభిమానులు మాత్రం ఆ వార్తలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంటారు . రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ ఒక యాడ్ లో నటించబోతున్నాడు అని ..ఆ యాడ్ కి సంబంధించిన షూటింగ్ క్లిప్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ పిక్స్ వైరల్ అవుతూ వచ్చాయి . వైరల్ అయింది ఫేక్ పిక్స్ నే అయినా ఆ లుక్స్ లో మాత్రం ప్రభాస్ అద్దిరిపోయే రేంజ్ లో ఉన్నాడు . చూస్తుంటేనే కొరుకుని తినేయాలి అనిపించే విధంగా ఆయన కటౌట్ ఉంది అంటూ అమ్మాయిల దగ్గర నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నిజానికి ప్రభాస్ ఎటువంటి యాడ్ లో ప్రస్తుతం నటించలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్ గతంలో సాహో సినిమా షూటింగ్ టైంలో లీకైన పిక్స్ మాత్రమే. ఆ టైంలో ప్రభాస్ పిక్స్ ని ఎంత లైక్ చేసారో అభిమానులు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు . మరొకసారి ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ప్రభాస్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు అభిమానులు . కొంతమంది టాలెంటెడ్ హీరో అంటుంటే మరి కొంతమంది ఆరడుగుల కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ ప్రభాస్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మొత్తానికి తేలింది ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న పిక్స్ కేవలం సినిమాకు సంబంధించిన వి మాత్రమే .. అది కూడా ఎప్పుడో రిలీజ్ అయిన సాహో మూవీ ప్రభాస్ పిక్స్.. ప్రెసెంట్ అయితే ప్రభాస్ ఎటువంటి యాడ్లో నటించలేదు . ఇక ఆయనకు కటౌట్ గురించి అంటారా ..? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది . మరి మీకు ప్రభాస్ కటౌట్ చూస్తుంటే ఏం ఫీలింగ్ వస్తుంది..??