మలయాళీ భామ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ ఒకప్పుడు సోషల్ మీడియాని తన కను సైగలతో షేక్ చేసింది. ఒరు ఆదార్ లవ్ సినిమాలోని కన్నుగీటే సన్నివేశంతో ఓవర్ నైట్ లోనే ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. ఆ ఒకే ఒక్క షాట్ తో పాన్ ఇండియాలో ప్రియా ప్రకాష్ వారియర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలలో అవకాశాలను అందుకుంది. ఈ భామ తనదైన నటన, అందంతో ప్రతి ఒక్క సినీ అభిమానిని తన వైపుకు తిప్పుకుంది. 

కేవలం మలయాళం లోనే కాకుండా తెలుగు, కన్నడ, హిందీలో సినిమాలు చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రియా ప్రకాష్ వారియార్ కు సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి క్షణాల్లోనే వైరల్ గా మారుతాయి. వరుసగా ఫోటోషాట్లు చేస్తూ వాటిని తన అభిమానులతో పంచుకుంటుంది ప్రియా ప్రకాష్ వారియర్.

ఇక సోషల్ మీడియాలో కేవలం ఒకే ఒక్క రోజులో ఆరు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ తెచ్చుకున్న నటిగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ప్రియా ప్రకాష్ ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ అవేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. రీసెంట్ గానే ప్రియా తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో గెస్ట్ పాత్రలో నటించింది.

 ఇదిలా ఉండగా.... ప్రియా ప్రకాశ్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. అందులో ప్రియా ప్రకాష్ హీరోతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలలో నటించింది. ఆ హీరో ప్రియాకు ముద్దులు పెడుతూ రొమాన్స్ చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఇలా బరితెగించి నటించడం అవసరమా అని కామెంట్లు చెబుతున్నారు. దీనిపై ప్రియా ప్రకాష్ వారియర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: