
అయితే బాలయ్య బాబు అఖండ 2: తాండవం సినిమా కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందే. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మరో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతుంది. అయితే ఈ సినిమాను తెరకెక్కించేందుకు షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి వచ్చి అలరించనుంది. ఈ మూవీ కోసం బాలయ్య ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా అఖండ సినిమాకు సంబంధించిన మరో వార్త నెట్టింట చెక్కర్లు కొడుతోంది. అఖండ సినిమాకి పార్ట్ 3 కూడా ఉందని తెలుస్తోంది. బాలయ్య, శ్రీను కాంబోలో మరో సినిమా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అఖండ పార్ట్ 2 సినిమా క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుందని సమాచారం. ఆ ట్విస్ట్ అఖండ 3 మూవీకి నాంది పలుకుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ పార్ట్ 3 కోసం దర్శకుడు, నటీనటులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అఖండ పార్ట్ 3 ఉంటుందా.. లేదా అనేది చూడాలి మరి.