తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి సినిమాలతో మంచి గుర్తింపును అందుకుంటారు. మరి కొంతమంది ఎన్ని సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేరు. అలాంటి వారిలో ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ఒకరు ఈ భామ మొదట యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం హీరోయిన్ గా సినీ పరిశ్రమకు పరిచయమైంది. మొదట తమిళ, మలయాళ, హిందీ సినిమాలలో నటించిన తర్వాత ఈ బ్యూటీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో "కౌసల్య కృష్ణమూర్తి... ది క్రికెటర్" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామసినిమా అనంతరం తెలుగులో వరుసగా అవకాశాలను అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగించింది. రీసెంట్ గా వెంకటేష్ సరసన హీరోయిన్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమానూ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ఐశ్వర్య రాజేష్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా అత్యంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా మంచి విజయాన్ని అందుకుంది. 


ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా అనంతరం ఐశ్వర్య రాజేష్ కు వరుసగా తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. వరుసగా సినిమాలు చేసుకుంటూ ఈ అమ్మడు బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ఐశ్వర్యకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఐశ్వర్య రాజేష్ ఓ సినిమాలో హీరోతో కలిసి ఘాటుగా రొమాన్స్ చేసింది. అందులో లిప్ లాక్ సన్నివేశాలు, బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉన్నాయి. ఐశ్వర్యను ఇలా చూసి తన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇంత అందం ఎలా మెయింటైన్ చేస్తున్నావని ప్రశ్నిస్తున్నారు. చాలా హాట్ గా, అందంగా ఉన్నావని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై ఐశ్వర్య ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: