హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన వార్2 సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన టీజర్ కు సైతం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు, ఎన్టీఆర్ అభిమానులకు నచ్చుతుందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏ సెంటర్ ఆడియన్స్ ను టార్గెట్ చేసే విధంగా ఈ సినిమా టీజర్ ఉంది.
 
వార్2 సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు సగానికి సగం పడిపోయాయని తెలుస్తోంది. ఈ సినిమా హక్కులు 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యే ఛాన్స్ అయితే ఉంది. అయితే యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇంత తక్కువ మొత్తానికి అంగీకరించే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. తారక్ ఈ సినిమాకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్నారు.
 
వార్2 సినిమా విషయంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం భారీ స్థాయిలో పోటీ నెలకొనే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. వార్2 సినిమా విడుదలకు 85 రోజుల సమయం మాత్రమే ఉంది. జులై నెల చివరి వారం నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు కానున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
సినిమా టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ విషయంలొ జూనియర్ ఎన్టీఅర్ మాత్రం సంతోషంగానే ఉన్నారని తెలుస్తోంది. వార్2 సినిమా కలెక్షన్ల విషయంలో సైతం సత్తా చాటి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వార్2 సినిమా ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలోనే ఉంది. వార్2 ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: