మలయాళం ప్రొడ్యూసర్ సాండ్రా థామస్ సూపరిచితమే. ఈమె కేవలం నిర్మాత మాత్రమే కాదు.. ఈమె సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. తక్కువ మూవీస్ లో కనిపించినప్పటికి మంచి క్రేజ్ ని సొంతం చేసుకుని.. ప్రేక్షకుల ఆదరణ పొందింది. ప్రస్తుతం సాండ్రా థామస్ ప్రొడక్షన్స్ బ్యానర్ ను నడుపుతున్నారు. తాజాగా సాండ్రా థామస్ షాకింగ్ కామెంట్స్ చేసింది. 

మలయాళ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈమె ఈ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో సాండ్రా థామస్ మాట్లాడుతూ.. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం చాలా కామన్ అంటూ బాంబు పేల్చింది. సినిమా షూటింగ్ సెట్స్ లో నిత్యం డ్రగ్స్ వాడతారని నిజం బయటపెట్టింది. ముఖ్యంగా డ్రగ్స్ కోసం ప్రత్యేక బడ్జెట్ పెడతారని తెలిపింది. అంతేకాకుండా డ్రగ్స్ వాడకం కోసం ప్రత్యేక గదులు కూడా కేటాయిస్తారని చెప్పుకొచ్చింది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసని.. అయినప్పటికీ సినీ పరిశ్రమలో ఉన్న ఏ ఒక్కరు దీని గురించి మాట్లాడరని విమర్శించింది. కనీసం ఈ సమస్యపైన ఎలాంటి చర్యలు తీసుకోరని అన్నారు. అలాగే సినీ పరిశ్రమ వాళ్ళందరూ ఈ సమస్యపై 5-10 సంవత్సరాల క్రితమే చర్యలు తీసుకోవాల్సిందని సాండ్రా థామస్  తెలిపారు. 

గొప్ప స్థాయిలో ఉన్న ఫిల్మ్ స్టార్స్ కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆమె ఆరోపించింది. స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని స్పష్టం చేశారు. దీనిపై చర్యలు తీసుకుంటే హీరోస్, హీరోయిన్స్ ఇమేజ్ దెబ్బతింటుందని భయపడి అందరూ వెనకడుగు వేస్తున్నారని వెల్లడించారు. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ మలయాళ సినీ ఇండస్ట్రీ ఈ సమస్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సాండ్రా థామస్ వ్యాఖ్యలు ఇతర సినీ పరిశ్రమలలో కూడా దుమారం పుట్టించాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: