మలయాళ నటుడు మోహన్ లాల్ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితం మోహన్ లాల్ "L2 ఎంపురన్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి బాక్సా ఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ మూవీ తర్వాత చాలా తక్కువ కాలంలోనే మోహన్ లాల్ నటించిన తుడారుమ్ అనే మూవీ విడుదల అయింది. ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీ లో భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఇతర ప్రాంతాల్లో మాత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయింది.

కానీ ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు నుండి అద్భుతమైన కలెక్షన్లు దక్కడం మొదలు అయింది. ఇక ఈ మూవీ విడుదల అయ్యి చాలా రోజులు అవుతున్నాయి. ఇప్పటికి ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఓ వైపు ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర విజయవంతంగా ప్రదర్శించబడుతున్న వేళ ఈ మూవీ ఓ టి టి విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల అయింది. ఈ సినిమా ఓ టి టి హక్కులను జియో హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. 

అందులో భాగంగా జియో హాట్ స్టార్ సంస్థ వారు తాజాగా తుడురుమ్ మూవీ ని మే 30 వ తేదీ నుండి మలయాళం , తెలుగు , తమిళ్ , హిందీ , కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇప్పటికే భారీ కలెక్షన్లతో బాక్సా ఫీస్ ను షేక్ చేసిన ఈ మూవీ ఓ టి టి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: