టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న నటులలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈయన వరుసగా దసరా , హాయ్ నాన్న , సరిపోదా శనివారం తాజాగా హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే నాని తన తదుపరి మూవీ ని శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ కి ది ప్యారడైజ్ అనే టైటిల్ ని కూడా మేకర్స్ ఫిక్స్ చేశారు. నాని హీరోగా నటించిన తాజా సినిమా హిట్ ది థర్డ్ కేస్ మూవీ మే 1 వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమా విడుదల కాగానే మే 2 వ తేదీ నుండి ది ప్యారడైజ్ మూవీ షూటింగ్లో నాని జాయిన్ అవుతాడు అనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికే హిట్ 3 మూవీ విడుదల అయ్యి చాలా రోజులు అవుతుంది.

కానీ ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాల రిహార్సర్స్ ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోని విడుదల చేసి ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న పెద్ది మూవీ ని మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ రెండు మూవీల మధ్య క్లాష్ ఏర్పడుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ స్టార్ట్ కావడం డిలే అవుతూ ఉండడంతో , పెద్ది సినిమాకు పోటీగా ది ప్యారడైజ్ రావడం కష్టమే అనే వార్తలు వస్తున్నాయి. దానికి చరణ్ అభిమానులు ఖుషి అవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: