ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం స్పిరిట్. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తొందర్లోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ ఇతర సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా మొదట బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను ఎంపిక చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల దీపికను సినిమా నుంచి తొలగించారు. 


దర్శకుడు సందీప్ రెడ్డి ఈ సినిమాలో మరో హీరోయిన్ ను ఫైనల్ చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు తృప్తి దిమ్రి. ఈ భామ తెలుగు, హిందీలో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. తనదైన నటన, అందచందాలతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ భామ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. అయితే ఈ సినిమాలో తృప్తికి దర్శకుడు సందీప్ రెడ్డి కొన్ని కండిషన్లు పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఆ కండిషన్లకు ఒప్పుకుంటేనే సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేస్తారట. స్పిరిట్ సినిమాలో వచ్చిన లాభాలలో ఎలాంటి ప్రాఫిట్స్ అడగకూడదని కండిషన్ పెట్టారు.

షూటింగ్ సమయంలో మరో రెండు గంటల పాటు ఎక్కువగా షూటింగ్ లో పాల్గొనాలని తృప్తికి సందీప్ రెడ్డి స్ట్రాంగ్ గా చెప్పారట. అంతేకాకుండా హీరోయిన్ తో షూటింగ్ స్పాట్ లోకి సెక్యూరిటీ పది మందికి లోపే ఉండాలని చెప్పారట.  సెక్యూరిటీ కుటుంబ సభ్యులతో కలిసి పదిమందికి మించి ఉండకూడదని వార్నింగ్ ఇచ్చారు. సినిమాలో నటించాలంటే తప్పకుండా తెలుగు నేర్చుకోవాలని స్ట్రాంగ్ గా చెప్పారట. ఈ కండిషన్లకు ఒప్పుకుంటేనే తృప్తి దిమ్రి ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో సమాచారం అందుతోంది. మరి ఈ కండిషన్లకు ఈ భామ ఒప్పుకుంటుందా లేదా అనే సందేహంలో కొంతమంది నెటిజన్లు ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: