
అత్తి సత్యనారాయణ ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దు చేయడం జరిగింది. ఈ వ్యవహారం గురించి అత్తి సత్యనారాయణ రియాక్ట్ అవుతూ కీలక వ్యాఖ్యలు చేశార్. దిల్ రాజు.. దమ్ముంటే ఆరోపణలు నిరూపించు అంటూ ఆయన సవాల్ విసిసారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ప్రాణమని ఆయన దేవుడని అలాంటి వ్యక్తి సినిమాను ఆపడానికి నేనెందుకు ప్రయత్నిస్తానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
దిల్ రాజు తన విషయంలో చేసిన ఆరోపణలు ప్రూవ్ చేయాలని సత్యనారాయణ కోరారు. తాము ఏప్రిల్ 24వ తేదీన థియేటర్ల మూసివేత నిర్ణయం తీసుకున్నామని ఆ సమయానికి హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించలేదని ఆయన అన్నారు. హరిహర వీరమల్లు మూవీ కొత్త రిలీజ్ డేట్ ను మే నెల 16వ తేదీన ప్రకటించడం జరిగిందని సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
తాను ఎప్పుడూ పవన్ కు విధేయుడినేనని ఆయన కామెంట్లు చేశారు. వాస్తవానికి సత్యనారాయణ కామెంట్లలో సైతం కొంతమేర నిజం ఉంది. హరిహర వీరమల్లు సినిమా విషయంలో కుట్ర చేసే దిశగా ఎవరూ అడుగులు వేయలేదు. అయితే థియేటర్ల బంద్ వ్యవహారం తెరపైకి రావడంతో ఆ సినిమానే టార్గెట్ చేశారని కొన్ని వాట్సాప్ మెసేజ్ లు సైతం చక్కర్లు కొట్టాయి. థియేటర్ల బంద్ వ్యవహారంలో పవన్ ను నిజంగానే ఎవరో మిస్ లీడ్ చేస్తున్నారని తెలుస్తోంది. సత్యనారాయణ సవాలు నేపథ్యంలో ఈయనపై నిందలు మోపిన వాళ్లకు సైతం షాక్ తగిలేనట్టేనని చెప్పవచ్చు.