పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితం టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత కొన్ని రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ అత్యంత వేగంగా ముందుకు సాగింది. దానితో ఈ సినిమా నుండి ఒక వీడియోను కూడా ఈ సినిమా షూటింగ్ను మొదలు పెట్టిన కొన్ని రోజులకే విడుదల చేశారు. అది అద్భుతంగా ఉండడం , దానికి ఎస్ ఎస్ తమన్ ఇచ్చిన సంగీతం అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఒక్క సారిగా ఆ వీడియోతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. దానితో ఎప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది.

తాజాగా పవన్ మళ్ళీ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై ఈ మూవీ యూనిట్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఈ మూవీ లో ఇమ్రాన్ హష్మీ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈయన వల్ల ఈ సినిమా షూటింగ్ కి మళ్ళీ బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ హష్మీ పై ఓజి యూనిట్ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించవలసి ఉందట. కాకపోతే ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఉండడంతో ఈయనపై చిత్రీకరించే సన్నివేశాలకు కాస్త బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే కానీ జరిగితే ఈ మూవీ షూటింగ్ మరికొన్ని రోజులు స్లో గా జరిగే అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pk