ఈ యేడాది రావాల్సిన పెద్ద సినిమాలన్నీ వరుసగా విడుదల తేదులు ప్రకటించుకుంటూ వస్తున్నాయి ... చిరంజీవి మూవీ విశ్వంభర మాత్రం ఇంకా అయోమయ స్థితిలోనే ఉంది .. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందా ? అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు .. విశ్వంభ‌ర‌ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయింది .. మహా అయితే రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది .. దాంతో పెద్దగా ఇబ్బంది లేదు .. కానీ రిలీజ్ డేట్ ప్రకటించాలంటే సీజీల నుంచి అవుట్ ఫుట్ రావాల్సి ఉంది .. ఈ సినిమా దాదాపు 90 శాతం ఇండోర్లోనే తీశారు .. సినిమా అంతా సీజీ వరకే అందుకోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ స్టూడియోలు వర్క్ చేస్తున్నాయి ..


అలాగే వాటి నుంచి అవుట్ ఫుట్ వచ్చాకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని చిరంజీవి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది .. ఒక్కసారి సీజీ వర్క్‌ వచ్చి అది నచ్చక మళ్ళీ వెనక్కి పంపి మళ్ళీ రిలీజ్ డేట్ మార్చి .. ప్రేక్షకులను గందరగోళంలో పడేయడం ఎందుకు ? సినిమా మొత్తం కంప్లీట్ చూసుకున్న తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటిదామని మెగాస్టార్ డిసైడ్ అయ్యారట .. అలాగే యువి క్రియేషన్స్ కూడా దీనికే కట్టుబడి ఉంది . జులై , ఆగస్టు ఈ రెండు నెలల్లో విశ్వంభరకు  రావడానికి అవకాశం ఉంది .. కానీ 2026 సంక్రాంతికి ఎలాగూ అనిల్ రావిపూడి సినిమా  ఉంది .. వీటి మధ్య నాలుగైదు నెలలైనా గ్యాప్ ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది .. అందుకే సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ ఎక్కడ కంగారు పడటం లేదని కూడా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: