
ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని గత ఏడాది `ప్రతినిధి 2` రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ ఇటీవల విడుదలైన `భైరవం`తో నారా రోహిత్ ను మంచి కంబ్యాక్ దొరికినట్లైంది. భైవవం రిజల్డ్ ఏమో గానీ.. వరద పాత్రలో మాత్రం సెటిల్డ్ యాక్టింగ్ తో నారా రోహిత్ అదరగొట్టేశాడు. ఇకపోతే నారా రోహిత్ స్టార్ అవ్వాల్సినవాడు. కానీ దరిద్రం ఆయన్ను వెంటాడుతూనే ఉంది. కెరీర్ లో జరిగిన రెండు బిగ్ మిస్టేక్స్ వల్ల నారా రోహిత్ టైర్ 2 హీరోల జాబితాలో అట్టడుగునే ఉండిపోయారు.
ఆ మిస్టేక్స్ లో ఒకటి `పుష్ప` మూవీలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను మిస్ చేసుకోవడం. సుకుమార్ ఆ క్యారెక్టర్ కోసం నారా రోహిత్‌నే మొదట సంప్రదించారు. కానీ ఎప్పుడైతే సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని భావించారో.. అప్పుడు రోహిత్‌ను పక్కన పెట్టి మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్‌ను ఎంపిక చేశారు. ఒకవేళ ఈ చిత్రంలో నారా రోహిత్ నటించి ఉండుంటే.. ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కి ఉండేది.
ఇక నారా రోహిత్ కెరీర్ లో జరిగిన రెండో మిస్టక్ `గీత గోవిందం` సినిమా చేజారడం. `సోలో` మూవీ తీసిన పరిచయడంతో డైరెక్టర్ పరశురామ్ గీత గోవిందం స్టోరీని ముందుగా నారా రోహిత్ కు చెప్పాడట. సొంత నిర్మాణంలో పరశురామ్ ఈ చిత్రం చేయాలని భావించాడు. అయితే అప్పటికే గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేస్తానని పరశురామ్ ఒప్పుకుని ఉన్నాడు. వారు ఒత్తిడి చేయడంతో గీతా ఆర్ట్స్ నిర్మాణంలోనే గీత గోవిందం చిత్రాన్ని తెరకెక్కించాలని పరశురామ్ డిసైడ్ అయ్యారు. దాంతో గీతా ఆర్ట్స్ వారు హీరోగా విజయ్ దేవరకొండకు ఛాన్స్ ఇచ్చారు. కట్ చేస్తే 2018లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నారా రోహిత్ ఈ మూవీ చేసుంటే ఆయన కెరీర్ మరోలా ఉండేది అనడంలో సందేహం లేదు. ఏదేమైనా ఈ రెండు తప్పిదాల్లో నారా రోహిత్ ప్రమేయం లేదు. కానీ ఎఫెక్ట్ అయింది మాత్రమే ఆయన కెరీరే.