
అనుష్క శర్మ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి.. క్రేజ్ కి ..బాలీవుడ్ బడా స్టార్ సెలబ్రెటీని పెళ్లి చేసుకుని ఉండొచ్చు . కానీ అనుష్కకి విరాట్ కోహ్లీ నిజాయితీ ..ఆయన పద్ధతిలో నచ్చాయి. అందుకే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2017 డిసెంబర్ 11వ తేదీ పెళ్లి చేసుకున్నారు విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ . ఆ తర్వాత సినిమాలలో పూర్తిగా నటించడం మానేసింది. అయితే ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా లేకపోయినా అనుష్క శర్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కన్నా కూసింత ఎక్కువుగానే సంపాదిస్తుంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే పోస్టులకు డబ్బులు బాగా వస్తాయి . సోషల్ మీడియా ద్వారా పలు బ్రాండెడ్ ప్రాడెక్ట్స్ ని ప్రమోట్ చేస్తే కోట్లకు కోట్లు అకౌంట్లో చేరుతాయి .
అలా అనుష్క శర్మ కి ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్.. ఆమె ఏదైనా ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే ఈజీగా నెలకు రెండు మూడు కోట్లకు పైగానే ఆదాయం వచ్చేలా చేస్తుంది . హీరోయిన్గా సినిమాలు లేకపోయినా నెలకు రెండు మూడు కోట్లకు పైగానే పోస్టులు ద్వారా సంపాదిస్తుంది అనుష్క. అంతేకాదు తన భర్త తన పిల్లల బాగోగులను దగ్గరుండి చూసుకుంటుంది . తన సినీ కెరియర్ మొత్తం కూడా ఫ్యామిలీ కోసం శాక్రిఫైజ్ చేసేసింది అనుష్క శర్మ. సోషల్ మీడియాలో ఇప్పుడు అనుష్క శర్మని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. మరి ముఖ్యంగా నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపిఎల్ 2025 ట్రోఫీని ముద్దాడడం ఇంకా హైలెట్గా మారింది . విరాట్ కోహ్లీ దాదాపు 17 ఏళ్ల కల నెరవేరింది అంటూ అందరు విరాట్ కోహ్లీని పొగిడేస్తున్నారు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ బీహేవ్ చేసిన పద్ధతి కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమకు నిదర్శనం అంటున్నారు అభిమానులు..!