ప్రతి మనిషికి తన లైఫ్ లో కొన్ని రోజులు చాలా చాలా స్పెషల్గా గుర్తుండిపోతూ ఉంటాయి . మరి ముఖ్యంగా పెళ్లి రోజు ..పుట్టినరోజు.. పిల్లల పుట్టినరోజులు.. లైఫ్ లో ఇంకా ఇంకా స్పెషల్ మూవ్మెంట్స్ కొన్ని అందరికీ గుర్తుంటాయి . అయితే జూనియర్ ఎన్టీఆర్ కి  మాత్రం ఓ రోజు  చాలా చాలా స్పెషల్. అది ఆయన పుట్టిన రోజు కాదు.. ఆయనకి పునర్జన్మ ఇచ్చిన రోజు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా చాలా డిఫరెంట్ . తన పుట్టినరోజు కన్నా తన పెళ్లి రోజు కన్నా తన సినిమాలు హిట్ అయిన రోజు కన్నా తనకి పునర్జన్మను కలిగించిన రోజును బాగా బాగా గుర్తుపెట్టుకుని.. ఆ రోజున చాలా చాలా ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు .


మనందరికీ తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా స్పెషల్ పర్సన్ . అందరిలా కాదు డబ్బు కోసం ఎలాంటి రోల్స్ పడితే  అలాంటి రోల్స్ చేయడు. మరి ముఖ్యంగా ఫ్యాన్స్ విషయంలో మాత్రం ఎప్పుడూ వేరే లెవెల్ అభిమానాన్ని అందుకుంటూ ఉంటాడు . అలాంటి జూనియర్ ఎన్టీఆర్ కి లైఫ్ లో మర్చిపోలేని రోజు అంటూ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా మార్చి 26న చెప్పాలి . ఆరోజు ఆయనకు పునర్జన్మను కలిగించిన రోజు . 2009 మార్చి 26న ప్రతి ఒక్క నందమూరి అభిమానులకి గుర్తుండే ఉంటుంది .2009 మార్చ్ 26న ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరిగి హైదరాబాద్ వస్తూ ఉండగా జూనియర్ ఎన్టీఆర్ కి బిగ్ ఆక్సిడెంట్ అయింది .

 

అసలు జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలతో బయటపడతాడు అని ఎవ్వరూ అనుకోలేదు.  ఎన్నికల ప్రచారం ముగించుకొని హైదరాబాద్ కి వస్తూ ఉండగా మోతె గ్రామం తిరుపతమ్మ గుడి మూలమలుపు వద్ద ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది . ఈ ఘటనలో ఎన్టీఆర్ తో సహా పక్కనే ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి . ఎన్టీఆర్ కి కూడా పూర్తిగా గాయాలు అయిపోయాయి . ఎన్టీఆర్ కారు బాగా డామేజ్ అయిపోయింది . ఎన్టీఆర్ అసలు ప్రాణాలతో బ్రతుకుతాడు అని ఎవరు కూడా ఊహించలేకపోయారు . కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు చాలా సేఫ్గా బయటపడ్డారు. అంతేకాదు అప్పటినుంచి జూనియర్ ఎన్టీఆర్ అటువైపుగా వెళ్లడమే మానేసారు . మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కి  తన పుట్టినరోజు కన్నా కూడా 2000 మార్చి 26వ తేదీని చాలా ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారట. 2009 మార్చ్ 26 కు జరిగిన ఆ యాక్సిడెంట్ ఎప్పటికీ మర్చిపోలేనిది .ఇప్పటికీ చాలామంది జనాలు   ఆ తేదీని గుర్తుంచుకొని మరి ఎన్టీఆర్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: