కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారు అయినటువంటి మంచు విష్ణు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే చాలా కాలం క్రితం సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే మంచు విష్ణు తాజాగా కన్నప్ప అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్ , మోహన్ లాల్ , అక్షయ్ కుమార్ మరి కొంత మంది ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉన్న నటీ నటులు కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ ని జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ హీరో అయినటువంటి మంచి విష్ణు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టాడు. అందులో భాగంగా వరుస పెట్టి అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తున్నాడు. తాజాగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన తన నాన్న గారు అయినటువంటి మోహన్ బాబు హీరోగా రూపొందిన ఓ సినిమాను రీమిక్ చేయాలి అని ఉన్నట్లు , అలాగే ఆ సినిమాకు ఎవరు దర్శకుడిగా ఉండాలి అనే దాని గురించి కూడా స్పందించాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ ... మా నాన్న గారు అయినటువంటి మోహన్ బాబు గారు నటించిన అసెంబ్లీ రౌడీ మూవీ ని రీమిక్ చేయాలి అని ఉంది. అలాగే అలాగే ఆ మూవీ ని కనుక రీమేక్ చేసినట్లయితే దానికి శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా ఉంటే అద్భుతంగా ఉంటుంది అని విష్ణు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజాగా మంచు విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే మంచు విష్ణు తాజాగా నటించిన కన్నప్ప సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: