
డోకా సినిమాతో స్టార్ హీరోగా పేరు సంపాదించిన ముజమ్మీల్ ఇబ్రహీం ఇటీవలే ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ దీపిక పదుకొనే గురించి పలు విషయాలను తెలిపారు.. దీపిక పదుకొనేతో తాను రెండు సంవత్సరాల వరకు ప్రేమయనం నడిపినట్టు తెలిపారు. ముంబైకి వచ్చిన సమయంలో తనకి ముందు పరిచయమయ్యింది దీపిక అంటూ ముజమ్మీల్ ఇబ్రహీం తెలిపారు. 2002లోనే ఆమెతో తనకు పరిచయం ఏర్పడిందని వెల్లడించారు. ఆ తర్వాతే ఇద్దరం డేటింగ్ చేసుకున్నామని మొదట దీపిక తనకు ప్రపోజ్ చేసిందంటూ తెలియజేశారు ముజమ్మీల్ ఇబ్రహీం.
అయితే ఆ తర్వాతే తన యాక్సెప్ట్ చేశాను.. కొన్ని కారణాల చేత వదిలేయవలసి వచ్చిందని తెలిపారు .వదులుకున్నందుకు ఎలాంటి బాధపడలేదు ఎందుకంటే వివాహానికి ముందు వరకు తనతో మాట్లాడింది. వివాహం తర్వాత తనతో టచ్లో లేదని ఆమె ఒక మంచి యాక్టర్ అంటూ తెలిపారు. దీపిక పదుకొనే చాలామంది హీరోలతో డేటింగ్ చేసిందని ఇప్పటికే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఈ విషయాలను ఆమె చెప్పకపోయినా చాలా మంది తెలియజేశారు.ముజమ్మీల్ ఇబ్రహీం చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ప్రస్తుతం దీపికా రణవీర్ సింగ్ ని వివాహం చేసుకొని ఒక బిడ్డకు తల్లి కూడా అయింది. అటు ఒక వైపు సినిమాలతో బిజినెస్ లో సత్తా చాటుతోంది దీపిక.