డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి మూవీ ని తమిళ నటుడు అయినటువంటి విజయ్ సేతుపతితో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ లో టబు ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాలో రాధిక ఆప్టే కూడా నటించబోతున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఈ సినిమాలో రాధిక ఆప్టే కోసం అనుకున్న పాత్రలో నివేత థామస్ ను తీసుకున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు ప్రస్తుతం వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే పూరి జగన్నాథ్ , విజయ్ సేతుపతి కాంబో మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాక వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ అనుకుంటున్నట్లు , దీనినే ఆల్మోస్ట్ కన్ఫామ్ చేయనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ కొన్ని రోజుల క్రితం విజయ్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ... నేను పూరి జగన్నాథ్ తో చేయబోయే సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ అనుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు అన్ని పూర్తిగా అవాస్తవం అని , ఆ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ ఏది అనుకోలేదు అని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ ను కన్ఫామ్ చేసినట్లు తెలుస్తుంది.

మూవీ కి మహతి స్వర సాగర్ లో సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. తెలుగు దర్శకుడు , తమిళ హీరో కాంబోలో తెరకెక్కనున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ఇటు టాలీవుడ్ , అటు కోలీవుడ్ ఇండస్ట్రీ లలో మంచి అంచనాలు నెలకొనే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: