లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, గ్లోబల్ స్టార్ కమల్ హాసన్ కాంబినేషన్ లో ఇటీవల వచ్చిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా `థగ్ లైఫ్`. శింబు, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, అభిరామి, అశోక్‌ సెల్వన్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మ‌ణిర‌త్నం, క‌మ‌ల్ హాస‌న్ క‌లిసి నిర్మించిన థ‌గ్ లైఫ్‌.. భారీ అంచనాల నడుమ జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.


కానీ మొదటి రోజే అట్టర్ ప్లాప్ టాక్‌ ను సొంతం చేసుకుంది. తమిళం తో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి థ‌గ్ లైఫ్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ఆయ‌న్ను దారుణంగా దెబ్బకొట్టింద‌నే చెప్పాలి. దాదాపు రూ. 12 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్ తో తెలుగు ప్రేక్షకులను ప‌ల‌క‌రించిన థ‌గ్ లైఫ్‌.. వీకెండ్‌ ముగిసే సమయానికి రూ. 2 కోట్ల రేంజ్ లో షేర్ క‌లెక్ష‌న్స్ ను రాబట్టింది.


ఇక నిన్న మండే టెస్ట్ లో మూవీ అన్ని భాష‌ల్లో పూర్తిగా ఫెయిల్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 8 లక్షల వరకు వసూలు చేయగలిగింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 1.30 కోట్ల‌తో స‌రిపెట్టుకుంది. హైదరాబాదులో పలు సెంటర్స్ లో ఆక్యుపెన్సి లేక షోలు కూడా రద్దు చేశారు. మంగళ వారానికి థియేటర్స్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయాయి. థ‌గ్ లైఫ్ వ‌ర‌ల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 106 కోట్లు కాగా.. ఇప్ప‌టికి క‌నీసం రూ. 50 కోట్లు కూడా వ‌సూల్ చేయ‌లేక‌పోయింది. మొత్తానికి మండే టెస్ట్ తో థగ్ లైఫ్ డిజాస్ట‌ర్ దిశ‌గా దూసుకుపోతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: