
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా , శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఎవెటెడ్ మాస్ మసాలా యాక్షన్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్” .. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమా ఫుల్ లెన్త్ షెడ్యూల్ షూటింగ్ కి రెడీ అవుతుంది .. రీసెంట్ గానే హరిహర వీరమల్లు , ఓజి సినిమాల షూటింగ్ ను కంప్లీట్ చేసిన పవన్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో అడుగుపెట్టెందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది .. ఈరోజు జూన్ 10 నుంచి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ సినిమా షూటింగ్ మళ్లీ పునః ప్రారంభం అయినట్టు తెలుస్తుంది ..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాల తో షూటింగ్ మొదలు కాగా . పవన్ కూడా ఈనెల 12 లేదా 13 నుంచి ఈ సినిమా షూటింగ్లో అడుగు పెడతారని అంటున్నారు .. అలాగే ఈ షెడ్యూల్ మొత్తం 30 రోజుల పాటు జరగనుంది .. ఈ సినిమా కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండ గా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు . అలాగే వచ్చే ఏడాది ఈ సినిమా ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు .. హరీశంకర్ “ఉస్తాద్ భగత్ సింగ్” తో బాక్సాఫీస్ వద్ద మరోసారి కం బ్యాక్ ఇస్తారా లేదో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..