బాలకృష్ణ హీరోయిన్ అనగానే చాలామంది హీరోయిన్ల పేర్లు తెరమీద వినిపిస్తాయి. ఎందుకంటే ఇప్పటికే బాలకృష్ణ వందకి పైగా మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే అలాంటి హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ కూడా ఒకరు.. బాలకృష్ణ నటించిన లెజెండ్, అఖండ వంటి రెండు సినిమాలలో ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణతో కలిసి ఆడి పాడింది. అలా వీరిద్దరి జోడికి టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద చాలామంది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలా బాలకృష్ణతో విజయశాంతి,సిమ్రాన్, ఎలా అయితే కరెక్ట్ గా సెట్ అయ్యారో ప్రగ్యా జైస్వాల్ కూడా అంతే బాగా కరెక్ట్ గా సెట్ అయింది. అయితే అలాంటి బాలకృష్ణ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతునట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

అంతేకాదు తన ప్రియుడిని కూడా పరిచయం చేసినట్టు సోషల్ మీడియా జనాలు మాట్లాడుకుంటున్నారు.మరి ఇంతకీ ప్రగ్యా జైస్వాల్ ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది.. ఆమె పెళ్లి వార్తలు నిజమేనా..అనేది ఇప్పుడు చూద్దాం.. వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత ఓం నమో వెంకటేశాయా, గుంటూరోడు, నక్షత్రం,ఆచారి అమెరికా యాత్ర, అఖండ, డాకు మహారాజ్ వంటి సినిమాల్లో నటించింది.అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయిక సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన స్నేహితులతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది. అలా వెకేషన్ కి వెళ్ళిన సమయంలో దిగిన కొన్ని ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.
 అయితే ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొట్టడంతో ప్రగ్యా జైస్వాల్ హాట్ అందాలకి చాలామంది ఫిదా అవుతున్నారు. అయితే ఈ ఫోటోలన్నింటిలో ప్రగ్యా జైస్వాల్ ఓ వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంది. అయితే ఆయనతో క్లోజ్ గా ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆయన ప్రగ్యా జైస్వాల్ ప్రియుడు అని,త్వరలోనే ఆమె ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతుందని, ఈ విధంగా అభిమానులకు హింట్ ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో ఈ ఫోటోల కింద నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ప్రగ్యా జైస్వాల్ నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా.. ఆమె షేర్ చేసిన ఫోటోలలో ఉంది ఆమె ప్రియుడా..లేక స్నేహితుడా.. అనేది క్లారిటీ రావాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: