
బన్నీ వాస్ చేయాలనుకుంటే స్టార్ హీరోలు , పెద్ద డైరెక్టర్లతో మంచి మంచి కాంబినేషన్లు సెట్ చేసుకోగలరు .. ఆ మాత్రం పలుకుబడి ఆయనకు ఉంది ఆ పెట్టుబడిని కూడా ఆయననే సర్దుబాటు చేసుకోగలరు .. కానీ జాతరత్నాలు టైపులో ఓ చిన్న సినిమా తీశారు .. ఒక విధంగా ఇది మంచి ఆలోచన .. తన బ్యానర్ వ్యాల్యూ తో వచ్చే చిన్న సినిమాలకు మంచి వ్యాల్యూ ఉంటుంది .. ప్రస్తుతం సితార సంస్థ కూడా ఇదే పని చేస్తుంది .. ఈ బ్యానర్ నుంచి వచ్చిన మ్యాడ్ , మ్యాడ్ 2, టిల్లు సినిమాలు బాగా హీట్ అయ్యాయి .. అలాగే లాభాలు కూడా బాగా అర్జంచాయి .. నాని కూడా తన బ్యానర్ లో చిన్న సినిమాలు తీసుకువస్తున్నాడు .. ఇక ఇప్పుడు బన్నీ వాసు కూడా ఇదే రూట్ లో వెళ్తున్నాడు .. మిత్రమండలి టీజర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది.. ఎంతో ప్రామిసింగ్ గా ఉంది ఓటీటీ బేరాలకు ఎలాంటి డొక్కా ఉండదు .. ప్రియదర్శి , వెన్నెల కిషోర్ గ్యాంగ్ ఉంది కాబట్టి పెట్టుబడి మొత్తం ఓటీటీ రూపంలోని వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి ..
ఒక విధంగా విడుదలకు ముందే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది .. ఒక నిర్మాతకు అంతకంటే ఏం కావాలి .. గీతా ఆర్ట్స్ 2 నుంచి వచ్చిన ఆయ్ కూడా ఇలానే సేఫ్ అయింది .. ఈ ప్రాజెక్టుని దగ్గరుండి చూసుకునేది బన్నీ వాస్ కాబట్టి ఆ అనుభవంతో ఈ సినిమాని మంచిగా టేక్ ఆఫ్ చేసి ఉండవచ్చు .. అయితే బన్నీ వాస్ పేరుతో కొత్త బ్యానర్ పెట్టగానే సోషల్ మీడియాలో కాస్త నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది .. గీత ఆర్ట్స్ నుంచి విడిపోయాడా ? అల్లు అరవింద్ తో గొడవలు అయ్యాయా .. ఇద్దరకి పడటం లేదా అని.. ఇలా ఊహాగానులు బయటికి వచ్చాయి .. అలాంటివేమీ రాకుండా టీజర్ విడుదలకు అల్లు అరవింద్ ను గెస్ట్ గా పిలిచి ఆయనతోనే వీడుదలచేపించుకున్నాడు .. అలాగే నా గాడ్ ఫాదర్ అంటూ ఘనంగా చెప్పుకున్నారు .. ఎలాంటి రిస్కు లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ..