టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో మొట్ట మొదటి సారి హిందీ లో వార్ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ కూడా కనిపించబోతున్నాడు. ఇలా తారక్ , హృతిక్ రోషన్ కలిసి నటించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీవని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ ఇప్పటికే విడుదల చేశారు. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది.

ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను కొన్ని రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భం గా విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా టీజర్ లో కియార తన అద్భుతమైన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ విడుదలకు ఇంకా చాలా రోజులు ఉన్న ఈ సినిమా బుక్ మై షో లో అద్భుతమైన జోష్లో ముందుకు సాగుతుంది. విడుదలకు రెడీగా ఉన్న ఎన్నో హిందీ సినిమాలతో పోలిస్తే బుక్ మై షో లో వార్ 2 సినిమా అద్భుతమైన ప్లేస్ లో కొనసాగుతుంది.

ప్రస్తుతం బుక్ మై షో లో వార్ 2 సినిమాకు 142.8 కే ఇంట్రెస్ట్ లు దక్కాయి. వార్ 2 సినిమా తర్వాత సైయార సినిమా బుక్ మై షో లో రెండవ స్థానంలో ఉంది. ఇక ఈ మూవీ కేవలం బుక్ మై షో లో ప్రస్తుతం 43.9 కే ఇంట్రెస్ట్ లను మాత్రమే కలిగి వార్ 2 సినిమా తర్వాత స్థానంలో కొనసాగుతుంది. దీనితోనే అర్థం అవుతుంది హిందీ ప్రేక్షకులు వార్ 2 సినిమాపై ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారు అనేది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: