
రామన్ రాయ్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మీరు ఎల్లప్పుడూ కూడా మా హృదయాలలో ఉంటారు బాబాయ్ అంటూ మీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఓం శాంతి అంటూ తన ఇంస్టాగ్రామ్ లో రాసుకుంది. రామన్ రాయ్ వయసు 72 సంవత్సరాలు. ఈయన ఢిల్లీ హైకోర్టులో ప్రముఖ లాయర్ గా ఉండేవారు కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ సోమవారం రోజున తొలి శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ మన్నారా చోప్రా హీరోయిన్ గానే కాకుండా బిగ్ బాస్ 17 లో ఇటీవలే సందడి చేయడం జరిగింది.
మన్నార చోప్రా హిందీ తో పాటుగా తెలుగు ,తమిళ్ వంటి భాషలలో కూడా నటించి మెప్పించింది. అయితే ఈమె సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో తక్కువ సినిమాలలో నటించింది. మన్నారా చోప్రా విదేశాల నుంచి ఆలస్యంగా రావడం చేత అంత్యక్రియలు ముంబైలో ఈ రోజున జరిగినట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా కూడా సోషల్ మీడియా వేదికగా తెలపడంతో అభిమానులు కూడా ప్రియాంక చోప్రా బాబాయ్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ కోరుకుంటున్నారు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తూ ఉన్నది.