
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా వాస్తవానికి ఇప్పటికే థియేటర్లలోకి రావాలి. ఈనెల 12న రావాల్సి ఉన్న ఈ సినిమాను ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు. ఓటీటీ సంస్థతో చర్చలు ప్రారంభించారు. ఎట్టాకేలకు ఇప్పుడు మరో తేదీతో హరిహర వీరమల్లు సినిమా పోస్టర్ పడింది. ఈసారి జూలై 24న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సినిమా విడుదల తేదీలు ఓటీపీల చేతుల్లోకి వెళ్లిపోవడం ... మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ డేట్ కూడా ఓటిటి సంస్థలు డిసైడ్ చేయటం దారుణం అని గుసగుసలు టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరు ఏం చేయలేరు. రిస్కీగా మారిన థియేటర్ సిస్టం కంటే ఓటీటీ నుంచి ఫిక్స్ అమౌంట్ కంటికి కనిపిస్తున్నప్పుడు నిర్మాతలు కూడా ఓటీటీలకు సాగిన పడిపోవటం తప్ప చేసేదేమీ లేదు.
అటు విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సినిమా పరిస్థితి కూడా అలానే తయారైందని అంటున్నారు. ఆ సినిమా కూడా చెప్పిన తేదీకి రాకుండా వాయిదా పడింది. ఇప్పుడు ఓటీటీతో చర్చలు జరుగుతోంది. వచ్చేవారం కొత్త డేట్ తో పోస్టర్ పడుతుందని అంటున్నారు. హరిహర వీరమల్లు ... విజయ్ కింగ్డమ్ సినిమాల మధ్య పెద్ద గ్యాప్ ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. అయితే ఒకే తేదీకి రెండు సినిమాలు వచ్చే ఛాన్స్ లేదు. వీరమల్లు హిట్ అయ్యి లాంగ్ రన్ ఉంటే విజయ్ సినిమాపై ఆ ప్రభావం పడుతుంది. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు