తమిళ నటుడు ధనుష్ హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో కుబేర అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... నాగార్జునమూవీ లో అత్యంత కీలకమైన పాత్రలో నటించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ నిన్న అనగా జూన్ 20 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది.

ఇకపోతే ధనుష్ నటించిన ఎన్నో తమిళ సినిమాలు చాలా కాలం నుండి తెలుగులో డబ్ అయ్యి విడుదల అవుతూ వస్తున్నాయి. అందులో కొన్ని సినిమాలు తెలుగు బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలు సాధించడంతో ధనుష్ కి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. దానితో ఈయన కొంత కాలం క్రితం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ అనే తెలుగు సినిమాలో నటించాడు. ఈ మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.65 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. 

సార్ మూవీ తర్వాత ధనుష్ "కుబేర" అనే మరో తెలుగు సినిమాలో నటించాడు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ వచ్చింది. అలాగే ఈ మూవీ కి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ కూడా లభించాయి. దానితో మొదటి రోజు కుబేర సినిమా ఏకంగా కేవలం ఒక నైజాం ఏరియాలోనే 2.6 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి సార్ మూవీ కి కలెక్షన్లకు గట్టి పోటీ ఇచ్చింది. ప్రస్తుతం కుబేర మూవీ జోష్ చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: