సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉంటారు . కేవలం హీరోలు.. హీరో రోల్ లోనే నటించాలి అంటూ గిరి గిసుకొని ఉంటారు. కానీ మరి కొందరు మాత్రం హీరో కాదు.. విలన్ కాదు సైడ్ క్యారెక్టర్ లు కాదు క్యారెక్టర్ ఇంపార్టెంట్ అయితే చాలు అని నటించే హీరోలు ఉంటారు . ఆ లిస్టులో టాప్ నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ . కార్తీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా ..? ఎలాంటి రోల్స్ నైనా సరే అవలీలగా నటించే సత్తా ఉన్న హీరో కార్తీ.


ఆయనను అభిమానించి లైక్ చేసే జనాలు చాలామంది . రీసెంట్ గా కార్తీ ఓ స్టార్ హీరో కోసం విలన్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది . కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కార్తి తెలుగు ఇండస్ట్రీలోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు . కోలీవుడ్ లో ఏ విధమైనటువంటి కలెక్షన్స్ ఆయన సినిమాకి వస్తాయో.. టాలీవుడ్ లో కూడా అంతే కలెక్షన్స్ రాబడుతూ ఉంటుంది.



కాగా ప్రభాస్ అంటే కార్తీ చాలా చాలా ఇష్టం . ఈ విషయాన్ని పలు సార్లు ఎన్నో ఇంటర్వ్యూలలో బయటపెట్టారు.  ఇప్పుడు ఆయన ఫేవరెట్ హీరో కోసం విలన్ గా మారిపోతున్నాడు కార్తీ.  సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే.  ఈ సినిమాలో ప్రభాస్ కి నెగిటివ్ స్టేట్స్ ఉన్న ఆపోజిట్ క్యారెక్టర్ లో కార్తీ కనిపించబోతున్నారట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. కార్తీ తెలుగు హీరో కోసం విలన్ గా మారిన విషయాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తుంది కోలీవుడ్ మీడియా. అంతేకాదు చాలామంది సోషల్ మీడియాలో కార్తిని తెగ  పొగిడేస్తున్నారు . "నువ్వు రా రియల్ అభిమాని అంటే ..ప్రభాస్ కోసం విలన్ క్యారెక్టర్ ఒప్పుకున్నావు చూసావా..? నీ గట్స్ కి హ్యాట్సాఫ్" అంటూ క్రేజీ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు . ఒక్క దెబ్బతో స్పిరిట్ సినిమా హ్య్స్ష్ ట్యాగ్స్ విపరీతంగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: