టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిన్న ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మరియు టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ , టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ మరియు నిర్మాత అయినటువంటి దిల్ రాజు కూడా పాల్గొన్నారు. ఇకపోతే ఈ ఈవెంట్ లో భాగంగా రామ్ చరణ్ డ్రగ్స్ సమాజానికి ఎంత చేటు అనేదాని గురించి వివరించాడు. తాజాగా చరణ్ మాట్లాడుతూ ... మేము స్కూలుకు వెళ్లే సమయంలో స్కూల్ ముందు చిన్న చిన్న షాప్స్ ఉండేవి.

అందులో మేము కొన్ని వస్తువులు కొని తినే వారం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వార్త చాలా వైరల్ అయింది. కొన్ని స్కూల్స్ ముందు ఉంటున్న షాప్ లలో మరియు స్కూల్స్ ముందు ఉంటున్న ఐస్ క్రీమ్ బండ్లలో మత్తుమందు పెట్టి పిల్లలకు ఇస్తున్నారు అని దాని గురించి చాలా మంది పెద్ద ఎత్తున ధర్నా కూడా చేశారు. అప్పుడు నేను తండ్రిని కాదు. ఇప్పుడు నేను తండ్రిని. నాకు ఒక కూతురు ఉంది. ఆమెను నేను కొంత కాలంలో కచ్చితంగా స్కూల్ కి పంపించాలి. అలా స్కూలుకు పంపించాలి అన్నప్పుడు నాకు భయం వేస్తుంది. చాలా మంది తల్లిదండ్రులు కూడా ఇలానే భయపడుతూ ఉంటారు. అలాంటి భయం ఎవరికి ఉండకూడదు అంటే డ్రగ్స్ రహిత సమాజం మన అందరికీ కావాలి.

అది తల్లిదండ్రులకు , పిల్లలకు మంచి వాతావరణాన్ని ఇస్తుంది అని చెప్పాడు. అలాగే డ్రగ్స్ ఇచ్చే మత్తు కంటే కూడా మంచిగా స్కూలుకు వెళ్లి ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే వచ్చే హైప్ ఎంతో ఎక్కువ. మనం రోజంతా కష్టపడి మన ఫ్యామిలీతో గడిపే ఆ కొద్ది సమయం ఎంతో కిక్ ను ఇస్తుంది. అలాగే ఒక మంచి గేమ్ ఆడితే అద్భుతమైన హైప్ వస్తుంది. ఇలాంటి హైప్ మనందరికీ అవసరం. డ్రగ్స్ వల్ల వచ్చే హైప్ అస్సలు అవసరం లేదు. మన ఫ్యామిలీని , అక్కాచెల్లెలను మన చుట్టు పక్కల ఉన్న వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలి అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: