సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్ దర్శకులు ఉన్నారు. ఇక ఎక్కువ శాతం స్టార్ దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం స్టార్ దర్శకులు దర్శకత్వం వహించే సినిమాలకు ఎక్కువ బడ్జెట్ అవుతూ ఉంటుంది. అలాంటి భారీ బడ్జెట్ సినిమాలను చిన్న హీరోలతో తీసినట్లైతే కొన్ని సందర్భాలలో అంతగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉండదు. దానితో నిర్మాతకు పెద్ద మొత్తంలో లాభాలు వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటాయి. అదే స్టార్ హీరో , స్టార్ డైరెక్టర్ కాంబోలో సినిమా రూపొందితే ఆ మూవీ కి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. దానితో స్టార్ హీరో , స్టార్ డైరెక్టర్ కాంబోలోనే నిర్మాతలు మూవీ చేయడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

ఇకపోతే ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో ప్రశాంత్ నీల్ ఒకరు. ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ దర్శకులు ఎవరితో సినిమా చేసిన సినిమా స్టార్ట్ అయిన వెంటనే టైటిల్ను అనౌన్స్ చేయడం లేదు. సినిమా మొదలు అయ్యి కొంత కాలం పూర్తి అయ్యాక కొన్ని మూవీ బృందాలు టైటిల్ను అనౌన్స్ చేస్తూ ఉంటే , కొంత మంది అయితే సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందే టైటిల్ను ఫిక్స్ చేయడం జరుగుతూ వస్తుంది. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకం. ఆయన సినిమా మొదలు కావడం కాదు , స్క్రిప్ట్ దశలో ఉండగానే టైటిల్ను కన్ఫామ్ చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో రూపొందుతున్న సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఆ తర్వాత ఈయన అల్లు అర్జున్ తో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ మూవీ కి రావణం అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా సినిమా స్టార్ట్ కాక ముందే మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఉండడంతో చాలా మంది స్టార్ హీరోల ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ ను చూసి చాలా మంది దర్శకులు నేర్చుకోవాలి అన్ని , సినిమాలకు ఇలాగే టైటిల్ను ముందే ఫిక్స్ చేస్తే బాగుంటుంది అని అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: