
టాలీవుడ్లో ఆ మాటకొస్తే పాన్ ఇండియా రేంజ్ రోవర్ బిగ్గెస్ట్ క్లాష్‌గా అందరూ భావిస్తున్న ఆగస్టు 14 కోసం కోట్ల మంది సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. హైప్ పరంగా చూసుకుంటే రజనీకాంత్ - లోకేష్ కనకరాజ్ కూలీ సినిమా చాలా ముందులో ఉంది. టీజర్ తప్ప వార్ 2 సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే ఆ వీడియో ఎక్కువ శాతం విమర్శలకు గురయింది. మరోవైపు రజిని ఇమేజ్ తో పాటు నాగార్జున ఫోటోని వాడుకునే దర్శకుడు లోకేష్ బాగా మార్కెటింగ్ చేస్తున్నాడు. ఇది కూలి సినిమాకు మంచి హైప్ తీసుకొస్తోంది. తెలుగులోనూ ఏరియాల వారీగా టాప్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను పంపిణీ చేస్తున్నారు. అయితే డిస్ట్రిబ్యూషన్ పరంగా వార్ 2 చాప కింద నీరులా దూసుకు పోతోందని ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి.
బాలీవుడ్ రిపోర్ట్ లు ప్రకారం ఇండియాలో ఉన్నమెజార్టీ ఒరిజినల్ ఐమాక్స్ స్క్రీన్ లలో అత్యధిక శాతం వార్ 2కు వచ్చేలా నిర్మాత ఆదిత్య చోప్రా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారట. అధిక శాతం ఐమ్యాక్స్‌లు పివిఆర్ చేతుల్లో ఉండడంతో ఈ పని మరింత సులభైందని అంటున్నారు. అంటే కూలీకి చాలా తక్కువగా సింగిల్ డిజిట్ లోనే ఈ స్పెషల్ స్క్రీన్లు దొరుకుతాయి అంటున్నారు. ఇది బిజినెస్ పరంగా తెలివైన ఎత్తుగడ .ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ కోసం సినిమాలు చూసే ఆడియన్స్ సంఖ్య ఎక్కువుంటుంది. ఉత్తరాది రాష్ట్రాలలో ఇది చాలా ఎక్కువ..! అలాంటప్పుడు కూలీ సినిమాకు సింగిల్ స్క్రీన్లు ... రెగ్యులర్ మల్టీప్లెక్స్ లతోనే సర్దుకోవాల్సి ఉంటుంది. వీటిలోనూ వార్ 2 చాలా బలమైన కాంపిటీషన్ ఇస్తుంది. నార్త్ ఇండియాలో జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ మాస్ సినిమా మీద జనాలలో ఎక్కువ ఆసక్తి ఉన్నట్టు తెలుస్తోంది. అది సౌత్ ఇండియా కు వచ్చేసరికి కూలి మీద ఎక్కువ అంచనాలు ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు