కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కలయికలో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ `కుబేర`. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, జిమ్ సర్భ్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఓ అపర కుబేరుడికి మరియు బిచ్చగాడికి మధ్య సాగే కుబేర చిత్రం.. జూన్ 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి ఆటనుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది.


ఫస్ట్ వీక్ ను విజయవంతంగా కంప్లీట్ చేసుకుని రెండో వీక్‌లో అడుగుపెట్టిన కుబేర.. థియేట‌ర్స్ వ‌ద్ద మాస్ ర‌చ్చ చేస్తోంది. పోటీగా కన్నప్ప విడుద‌లైనప్ప‌టికీ ధ‌నుష్‌-నాగార్జున మూవీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ బ్రేక్ ఈవెన్ అయింది. రెండో ఆదివారం నాడు కూడా కుబేర కుమ్మేసింది. సెకండ్ సండే బుక్ మై షోలో ఈ చిత్రానికి ఏకంగా 67 వేలకు పైగా టికెట్స్‌ బుక్ అయ్యాయ‌ట‌. ఈ లెక్క‌న చూసుకుంటే కుబేర‌ మ్యానియా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.


కాగా, అమిగోస్ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు క‌లిసి కుబేర మూవీని నిర్మించారు. ధ‌నికుడు, పేదవాడు అనే కాన్సెప్టుతో గ‌తంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. కానీ, కుబేర విష‌యంలో శేఖ‌ర్ క‌మ్ముల ట్రీట్మెంట్ కొత్తగా, ఫ్రెష్‌గా ఉండ‌టం సినిమాకు ప్లాన్ అయింది. నిజాయితీగా బతకాలనుకుని తప్పుడు వ్యక్తుల వైపు నిలబడే సీబీఐ ఆఫీసర్ దీపక్ క్యారెక్ట‌ర్‌లో నాగ్ ఒదిగిపోగా.. బిచ్చ‌గాడు దేవా పాత్ర‌లో ధ‌నుష్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ర‌ష్మిక కెరీర్‌లోనే గుర్తుండిపోయే పాత్ర‌ను చేసింది. దేవి శ్రీ అందించిన సంగీతం సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: