
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన డ్రాగన్ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. దాదాపుగా 400 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది జూన్ నెలలో ఈ సినిమా థియేటర్లో విడుదల కానుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో తారక్ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని కావడంతో ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే తారక్ సూచనల మేరకు ప్రశాంత్ నీల్ ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారం జరుగుతుందని రిలీజ్ డేట్ లో ఏ మార్పు ఉండదని తెలుస్తోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలు సాధిస్తున్నా సోలో హీరోగా భారీ బ్లాక్ బస్టర్ హిట్లు జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో చేరడం లేదు. వార్ 2 సినిమాపై కూడా అంచనాలు ఒకింత తక్కువగానే ఉన్నాయి. అందువల్ల తారక్ ఫ్యాన్స్ దృష్టి డ్రాగన్ సినిమాపై ఉంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక అప్డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
కర్ణాటక రాష్ట్రంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమాలో తారక్ పాత్రకు సంబంధించి వేరువేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం అధికారికంగా అప్డేట్స్ వచ్చే వరకు ఆగాల్సిందే. వరుస విజయాల తారక్ భవిష్యత్తులో సైతం సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు