- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )
టాలీవుడ్లో అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటి అయిన యువీ క్రియేషన్స్ ఇటీవల కాలంలో ఎందుకో వెనుకబడింది. తాజాగా ఆ బ్యానర్ నుంచి రెండు ప్రెస్టేజియ‌స్‌ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. రెండు ప‌లు కార‌ణాల‌తో రిలీజ్ వాయిదాలు ప‌డుతున్నాయి. ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా విశ్వంభర‌. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా తర్వాత చిరంజీవి నటించిన సోషియో ఫాంట‌సీ సినిమా ఇది. దాదాపు రు. 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా దాదాపు మూడేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటుంది. మొన్న సంక్రాంతికి రావాల్సి ఉన్న వాయిదా పడింది. తర్వాత సమ్మర్ అన్నారు.. సమ్మర్ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు బీ ఎఫ్ ఎక్స్ పనులతో పాటు ఓటిటీ డీల్‌ ఇంకా పూర్తికాక పోవడంతో ఈ ఏడాది ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.


2026 వేసవిలోనే డిసెంబర్ రిలీజ్ అవుతుందని అంటున్నారు. అప్పటివరకు ఈ సినిమా వడ్డీలు తడిసి మోపుడు కానున్నాయి. మరోవైపు ఆలస్యం అవుతున్న కొద్ది సినిమాపై క్రేజ్ తగ్గిపోతుంది. ఇక యూవీ క్రియేషన్స్ నుంచి వస్తున్న మరో క్రేజీ సినిమా అనుష్క నటిస్తున్న ఘాటీ. మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత అనౌన్స్‌ చేసిన ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. దర్శకుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా పలు కారణాలతో వాయిదాలు పడుతూ జూలైకి ఫిక్స్ అయింది. జూలై 11 రిలీజ్ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ నెలలో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. సినిమా పనులు ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో కొత్త డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తారని అంటున్నారు. విద్యాసాగర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో... యూవీ వాళ్లు ఎప్పుడు ఊపిరి పీల్చుకుంటారో ?  చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: