
టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో పూనమ్ కౌర్ ఒకరు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఆరోపణల ద్వారా పూనమ్ కౌర్ వేర్వేరు సందర్భాల్లో వార్తల్లో నిలిచారు. పూనమ్ తన పోస్ట్ లో ఒరిజినల్ కంటెంట్, స్క్రిప్ట్ ఉన్న డైరెక్టర్ క్రిష్ అని చెప్పుకొచ్చారు. ఎన్నో కాపీరైట్ సమస్యలు, పీఆర్ ద్వారా మేనేజ్ చేసిన దర్శకుడికి వచ్చిన గుర్తింపు, విజయం క్రిష్ కు దక్కలేదని ఆమె కామెంట్లు చేశారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరును పూనమ్ కౌర్ ప్రస్తావించకపోయినా ఆయనను ఉద్దేశించి ఆమె ఈ పోస్ట్ చేసిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం పూనమ్ కౌర్ వివాదం గురించి స్పందించడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఈ వివాదం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు చేసినా పూనమ్ కౌర్ కు అనుకూలంగా ఏమీ జరగలేదనే సంగతి తెలిసిందే.
మరోవైపు క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలకు ఊహించని సమస్యలు ఎదురవుతూ ఉండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఘాటీ సినిమా ఈ నెల 11వ తేదీన విడుదల కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతోంది. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు పూర్తి కాకుండానే విడుదలవుతూ ఉండటం గమనార్హం.
మరోవైపు త్రివిక్రమ్ పూనమ్ మధ్య వివాదానికి ఎప్పటికి చెక్ పడుతుందో చూడాల్సి ఉంది. పూనమ్ కౌర్ కు సైతం ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు అయితే రావడం లేదు. ఒక సినిమాలో పూనమ్ కౌర్ కు ఛాన్స్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా చేయడం వల్లే ఈ వివాదం చెలరేగింది అని కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. భవిష్యత్తులో అయినా ఈ వివాదానికి చెక్ పడుతుందేమో చూడాల్సి ఉంది.