తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలను రూపొందించి అందులో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఈయన ఇప్పటివరకు తన సినిమాల ద్వారా ఎంతో మంది దర్శకులను , న టీనటులను , టెక్నీషియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. ఈయన ఇండస్ట్రీ కి పరిచయం చేసిన వారిలో ఎంతో మంది ప్రస్తుతం గొప్ప గొప్ప స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఆయనకు ... మీరు ఎంతో మంది ని ఇండస్ట్రీ కి పరిచయం చేశారు.

మీరు ఇండస్ట్రీ కి పరిచయం చేసిన  వారిలో ప్రస్తుతం చాలా మంది గొప్ప స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్నారు. కానీ మీ సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ కి మీరు మంచి విజయాన్ని అందించలేకపోయారు అందుకు కారణం ఏమిటి అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానం చెబుతూ ... రౌడీ భాయ్ సినిమా కరోనా టైమ్ లో వచ్చింది. అది పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. 

లవ్ మీ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇకపోతే నేను , సుకుమార్ కలిసి ఆశిష్ హీరోగా సెల్ఫిష్ అనే మూవీ ని నిర్మించడానికి రెడీ అయ్యాం. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేశాం. కానీ ఆ మూవీ అవుట్ ఫుట్ మాకు పెద్దగా నచ్చలేదు. దానితో సినిమాను ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టాము. కొన్ని రోజుల తర్వాత తిరిగి మళ్లీ దాన్ని స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాం అని దిల్ రాజు తాజాగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే దిల్ రాజు తాజాగా తమ్ముడు అనే సినిమాను నిర్మించాడు. ఈ మూవీ రేపు అనగా జూలై 4 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: