తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో క్రిష్ జాగర్లమూడి ఒకరు. ఈయన గమ్యం మూవీతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి మూవీతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈయన ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా వైవిధ్యమైన కథలతో సినిమాలను రూపొందిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. చాలా కాలం క్రితం క్రిష్ , పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టాడు.

మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత పవన్ ఇతర సినిమాలపై ఫోకస్ పెట్టడం, ఆ తర్వాత ఈ సినిమాను స్టార్ట్ చేశాడు. కానీ ఆ తర్వాత పవన్ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఈ మూవీ షూటింగ్ పలుమార్లు ఆగిపోతూ వచ్చింది. దానితో క్రిష్ ఈ సినిమా దర్శకత్వ భాద్యతల నుండి తప్పుకున్నాడు.  ఈ సినిమా దర్శకత్వ భాద్యతల నుండి క్రిష్ తప్పుకున్నాక అనుష్క ప్రధాన పాత్రలో ఘాటి అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమాకు సంబంధించిన పనులు చాలా స్పీడ్ గా జరిగాయి. దానితో ఈ మూవీ అత్యంత వేగంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని చాలా మంది అనుకున్నారు. ఈ మూవీ ని ఈ జూలై నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు గట్టిగా వార్తలు బయటకు వచ్చాయి.

కానీ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు పెండింగ్లో ఉన్నట్లు , దానితో ఈ మూవీ ఆగస్టు నెలలో విడుదల కావడం కష్టం అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే క్రిష్ ఆఖరుగా కొండపొలం అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఈ మూవీ విడుదల అయ్యి చాలా కాలమే అవుతుంది. ఓ వైపు హరిహర వీరమల్లు మరో వైపు ఘాటి ఈ రెండు సినిమాల పనులు అనుకున్నంత స్పీడ్ గా జరగకపోవడంతో క్రిష్ మూవీలు ప్రేక్షకుల ముందుకు స్పీడ్ గా రాలేకపోతున్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: