పూజా హెగ్డే.. నిజంగా నక్కతోకే తొక్కిందేమో. ఈ అమ్మడి అదృష్టం ఎలా ఉందంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడుతున్న అవకాశాలు మాత్రం ఆగడం లేదు. 2020లో వచ్చిన `అలా వైకుంఠపురంలో` తర్వాత మళ్లీ పూజా హెగ్డే ఆ స్థాయి హిట్ చూడలేదు. ఈ మధ్యలో అర డ‌జ‌న్ పరాజయాలను మూటగ‌ట్టుకుంది. రీసెంట్ గా ఆమె నుంచి వచ్చిన `దేవా`, `రెట్రో` చిత్రాలు కూడా ప్రేక్షకుల‌ను నిరాశపరిచాయి. అయిన‌ప్ప‌టికీ చేతి నిండా సినిమాలతో బుట్టబొమ్మ ఫుల్ బిజీగా గ‌డుపుతోంది.


తాజాగా మరో గోల్డెన్ ఛాన్స్ ను కూడా అందుకుంది. ఇటీవ‌లె `కుబేర‌` మూవీతో బిగ్ హిట్ అందుకున్న కోలీవుడ్ స్టార్ ధ‌నుష్‌.. ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఈయ‌న లైన‌ప్ లో డైరెక్ట‌ర్ విఘ్నేష్ రాజా మూవీ కూడా ఉంది. వేల్ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఐసరి గణేశ్ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 15 నుంచి సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతుంది. `అరువడై` అనే టైటిల్ ను మేక‌ర్స్ ప‌రిశీలిస్తున్నారు.


అయితే పీరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో ధ‌నుష్ కు జోడిగా మొద‌ట యంగ్ సెన్సేష‌న్ మమితా బైజును ఎంపిక చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆ ఛాన్స్ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే కొట్టేసింద‌ట‌. ఇప్ప‌టికే ఆమెతో సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని.. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ని స‌మాచారం. ఇదే నిజ‌మైతే ధ‌నుష్‌, పూజా కాంబోలో వ‌స్తున్న తొలి చిత్ర‌మిదే. కాగా, పూజా హెగ్డే త‌మిళంలో `జన నాయగన్`, `కాంచ‌న 4` చిత్రాల్లో యాక్ట్ చేస్తోంది. అలాగే మ‌రోవైపు సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ లో `కూలీ`లో తెర పంచుకుంది. ఈ చిత్రం ఆగ‌స్టులో రిలీజ్ కాబోతుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: