లేటెస్ట్ గా  విడుదలైన ‘తమ్ముడు’  మొదటి రోజు మొదటి షోకి వచ్చిన పబ్లిక్ టాక్ రివ్యూలు అత్యంత భయకరంగా ఉంటడంతో నితిన్ అభిమానులు   కలవర పడుతున్నారు. ఈమూవీకి కనీసం యావరేజ్  టాక్  కూడ రాకపోవడంతో ఈమూవీని కొనుక్కున్న బయ్యర్లు తీవ్ర నిరాశలో ఉనట్లు   వార్తలు వస్తున్నాయి.    

మార్కెట్ పరంగా ఆలోచిస్తే నితిన్ రేంజ్ కంటే తక్కువ కలెక్షన్స్ తక్కువగా  రావడం ఇండస్ట్రి వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి నిర్మాత దిల్ రాజు ఈమూవీని అంతా తానై ప్రమోషన్ చేసిన్నప్పటికీ ఈమూవీకి ఈరేంజ్ లో  కలెక్షన్స్ రావడం షాకింగ్ గా మారింది అంటున్నారు. ఈసినిమాకు వస్తున్న    రెస్పాన్స్ చూస్తుంటే ఈమూవీ రన్  చాలా తక్కువ రోజులు  ఉండేలా కనిపిస్తోంది అంటున్నారు.

ఈసినిమాకు ఇలాంటి ఫలితం రావడం నితిన్ మాస్ వలయంలో చిక్కుకుపోవడమే అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘మాచర్ల నియోజకవర్గం’ ‘ఎక్స్ ట్రాడినరి మ్యాన్’ ‘రాబిన్ హుడు’ ‘తమ్ముడు’ ఈనాలుగు సినిమాలను  ఒక కామన్ పాయింట్ ఉండటంతో ఈ సినిమాను చూసే ప్రేక్షకులకు ఒకే సినిమా చూసినట్లు అనిపిస్తోంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.   ఒక కుటుంబం విలన్ వల్ల ప్రమాదంలో ఉంటే హీరో వెళ్ళి వీరోచితంగా పోరాడి రక్షించడం యాక్షన్ ఎపిసోడ్లు మాస్ ఎలిమెంట్లు ఓవర్ డోస్ లో పెట్టడంతో ఇలాంటి కధలను ఎంచుకుని నితిన్ పొరపాటు చేస్తున్నాడు అన్న కామెంట్స్  వస్తున్నాయి.    

దీనితో నితిన్ వీలైనంత వరకు తాను నటించే సినిమాకధలు డీఫెరెంట్ గా ఎంచుకుని తాను గతంలో నటించిన ‘ఇష్క్’ ‘గుండె జారీ గల్లంతయ్యిందే’ ‘అఆ’ ల స్థాయిలో నితిన్ నటించే సినిమాలు లేకుంటే అతడి కెరియర్  మరింత సమస్యలలో పడిపోతుంది అన్న అభిప్రాయలు వ్యక్తం  అవుతున్నాయి. ప్రస్తుతం నితిన్ ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో   ‘ఎల్లమ్మ’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తీస్తున్న  ఈమూవీ నితిన్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: