
ప్రపంచవ్యాప్తంగా పిల్లలతో సహా పెద్దలు ఇష్టపడి చూసే చిత్రాల జురాసిక్ పార్క్ చిత్రాలు కూడా ఒకటి.. 2022లో వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రానికి సీక్వెల్ గా తాజాగా జురాసిక్ వరల్డ్ రిబర్త్ అనే చిత్రాన్ని ఇంగ్లీషుతోపాటు ఇతర భాషలలో కూడా రిలీజ్ చేశారు. మరి ఈసారి కూడా ఎప్పటిలాగానే జురాసిక్ పార్క్ అంటే చిత్రాల లాగా మెప్పించింది.. పిల్లలను ఆకట్టుకునేలా ఉందా లేదా ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.
స్టోరీ విషయానికి వస్తే:
గుండె జబ్బులతో సహా మానవుడు ఎదుర్కొంటున్న ఎన్నో రకాల వ్యాధులను సైతం నయం చేయడానికి.. మూడు అరుదైన డైనోసార్ల కి సంబంధించిన రక్తంతో చేసే ఔషధం ఉన్నదని శాస్త్రవేత్తలు గుర్తిస్తారు. కానీ డైనోసార్స్ బ్రతికి ఉన్న వాటి నుంచే ఆ రక్తాన్ని సేకరిస్తేనే అది ఉపయోగపడుతుంది. దీనికోసం ఫార్మాన్యూటికల్స్ కు ప్రతినిత్యం వహించేటువంటి మార్టిన్ (రూఫర్స్ట్ ఫ్రెండ్) తో జొరబెన్నెట్ తో (స్కారిలేట్ జాన్సన్ ) తో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇలా చేతులు కలిపిన తర్వాత అరుదైన ప్రమాదకరమైన డైనోసార్లను గుర్తించి వాటి రక్తాన్ని సేకరించేందుకు డాక్టర్ హెన్రీ (జొనాథల్ బేయిలి ) తో పాటుగా మరి కొంతమంది కలిసి ఐలాండ్లో ఈ ప్రమాదకరమైన మిషన్ ని మొదలు పెడతారు. అలా మొదలు పెట్టిన సమయంలో ఈ బృందానికి ఎదురయ్యే పరిస్థితులు ఏంటి వీరందరూ డైనోసార్ నుంచి రక్తాన్ని సేకరించారా లేదా అన్నది చూడాలి.
సినిమా ఎలా ఉందంటే..1993 స్పిల్ బర్గ్ డైరెక్షన్లో వచ్చిన జురాసిక్ పార్క్ సినిమా ఒక అద్భుతం. అప్పటివరకు అలాంటి సినిమాలు ప్రేక్షకులు చూడలేదు. జురాసిక్ పార్క్ సినిమా పేరుతో వచ్చిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఒళ్ళు గగుర్పాటుచే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి కానీ రాను రాను రొటీన్ కథలు మారిపోవడం వల్ల కొత్తదనం ఏమీ లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. 2022లో వచ్చిన జురాసిక్ పార్క్ వరల్డ్ డొమినియన్ విడుదలైన ఈ సిరీస్ నవ్వుల పాలు చేసింది.. కానీ దాంతో పోలిస్తే తాజాగా విడుదలైన జురాసిక్ వరల్డ్ రి బర్త్ పర్వాలేదు అనిపించుకుంది..
ఇందులో చూపించిన సముద్ర మార్గాలు ,ఫ్యామిలీ ట్రాక్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి.ఈ ట్రాక్ లోని పాత్రలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి కథకు నచ్చినట్టుగా ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా అర్థమయ్యేలా చూపించారు.. డైనోసార్ నుంచి తప్పించుకునే సన్నివేశాలు చాలా ఉత్కంఠ పరిచేలా చేస్తాయి. క్లైమాక్స్ ప్రేక్షకులకు ముందుగానే ఊహించే విధంగానే కనిపిస్తాయి. డైరెక్టర్ గారెత్ ఎడ్వర్డ్స్ తెరకెక్కించారు.
ప్లస్సులు:
సినిమా విజువల్స్, కొన్నిథ్రిల్ ఎలివేషన్స్
మైనస్:
రొటీన్ కథ, మెప్పించని యాక్షన్స్ సన్ని వేషాలు, సాగదీత వ్యవహారం.