పని పాట లేని ప్రతి ఒక్కరికి మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది..? మెగా ఫ్యామిలీలో ఏం జరగబోతుంది..? అనే దానిపైనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ . అదే విధంగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . రీసెంట్గా నాగబాబు కుమార్తె నిహారిక తన రెండో ప్రొడక్షన్ సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే , విడాకుల తర్వాత నిహారిక తన  సొంతకాళ్లపై నిలబడాలి అన్న ఉద్దేశంతో సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది . పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటూ తనదైన స్టైల్ లో దాన్ని ముందుకు తీసుకెళ్లింది. " కమిటీ కుర్రాళ్ళు" అనే సినిమా నిర్మించింది .


సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఆమె మంచి పేరు కూడా దక్కించుకుంది.  ఇప్పుడు సెకండ్ సినిమా స్టార్ట్ చేసింది నిహారిక.  ఈ సినిమాలో నయన సారిక హీరోయిన్ గా నటిస్తుంది.  అలాగే సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు . సింగిల్ హీరోగా సంతోష్  శోభన్ నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం గరనార్హం. రీసెంట్గా పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పిక్స్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి . అయితే నిహారికసినిమా ప్రొడక్షన్ కోసం ఎంత కష్టపడుతుంది అనే విధంగా కొన్ని వీడియోస్ ఉంటే తన అందాన్ని ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తుంది అనేలా మరికొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .



మరీ ముఖ్యంగా అవసరం ఉన్నా లేకపోయినా సంతోష శోభన్ తో రాసుకొని పూసుకుని తిరుగుతున్న కొన్ని ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కి గురవుతున్నాయి.  కొంతమంది మెగా ఫాన్స్ దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు . ఇది ఆమె ఆయనతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే అలా మూవ్ అవుతుంది అంటే మరి కొందరు ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా ఒక విడాకులు తీసుకున్నా అమ్మాయి ఒక పెళ్ళికాని అబ్బాయితో ఎలా మూవ్ అవుతుంది..?  అంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు . కొంతమంది మెగా ఫ్యామిలీకి కాబోయే అల్లుడేమో సంతోష్ అంటూ  హద్దులు మీరు పోయి మాట్లాడేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో నిహారిక పేరు వైరల్ అవుతుంది . కానీ నిహారిక మాత్రం అలాంటివి ఏమీ పట్టించుకోవట్లేదు . తన పని తాను చూసుకుంటుంది . కొంతమంది మెగా ఫ్యామిలీ పరువు తీయడానికి ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు అంటూ మెగా ఫాన్స్ కూడా మండిపడుతున్నారు. మరి కొంతమంది మాత్రం నిహారిక ఉన్న పరువు తీస్తుంది నాన్న - బాబాయ్ - పెదనాన్న సంపాదించుకున్న పరువు మొత్తం పోగొడుతుంది అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: