పాయ‌ల్ రాజ్‌పుత్‌.. సీరియ‌ల్స్ తో కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాతి కాలంలో వెండితెర‌పై అడుగుపెట్టింది. `ఆర్‌ఎక్స్‌ 100` మూవీతో టాలీవుడ్ లో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో తొలి సినిమాకే బోల్డ్ బ్యూటీ అనే ముద్ర ప‌డ‌టంతో.. టాలెంట్‌, అంత‌కు మించిన గ్లామ‌ర్ ఉన్న కూడా స్టార్ హీరోలు ఆమె వొంక చూడ‌లేదు.
దాంతో వ‌చ్చిన అవ‌కాశాల‌తోనే పాయ‌ల్ ముందుకు సాగుతోంది. తెలుగులో `ఎన్టీఆర్: కథానాయకుడు`, `వెంకీ మామా`, `డిస్కో రాజా`, `అన‌గ‌న‌గా ఓ అతిథి`, `తీస్ మార్ ఖాన్` త‌దిత‌ర చిత్రాల్లో పాయ‌ల్ న‌టించింది. ఇటు త‌మిళ్‌, పంజాబీ, క‌న్న‌డ‌ భాష‌ల్లోనూ అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేసింది.
అయితే స‌రైన హిట్ ప‌డ‌క‌పోవ‌డంతో పాయ‌ల్ కెరీర్ డౌన్ అవుతూ వ‌స్తోంది. 2023లో ఈ బ్యూటీ న‌టించిన `మంగళవారం` సినిమా విజ‌య‌వంతం అయిన‌ప్ప‌టికీ.. ఆమె కెరీర్ ఊపందుకున్న‌ది లేదు. సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సోష‌ల్ మీడియాలో పాయ‌ల్‌ ఈ మ‌ధ్య మ‌రింత యాక్టివ్ గా మారింది.
నిత్యం గ్లామ‌ర‌స్ ఫోటోషూట్ల‌తో నెట్టింట మంట‌లు రేపుతోంది. తాజాగా మ‌రోసారి త‌న అందాల‌తో కుర్రాళ్ల‌ను ట్రాప్ చేసేసింది. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్, డెనిమ్ షార్ట్ తో బ్యాక్ చూపిస్తూ పాయిల్ ఇచ్చిన పోజులు చూస్తే మ‌తిపోవాల్సిందే.
స్కిన్ షోకు తోడు అమ్మ‌డి ఓర చూపులు కుర్ర‌కారుకు ఇంకాస్త వెరెక్కిస్తున్నాయి. పాయ‌ల్ తాజా ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మ‌రి లేటెందుకు వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.
వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: